నౌకాదళంలో చేరిన మూడో స్వదేశీ నూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్ సబ్ మెరైన్ ఐఎన్ఎస్ అరిదమన్
నూక్లియర్ మిసైల్స్ ను ప్రయోగించే..
అమరావతి: అణుశక్తితో ప్రయాణించే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి (SSBN) అయిన INS అరిదమన్‌ను,రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం విశాఖపట్నంలో నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారత్ మూడో స్వదేశీ అణు సబ్‌మెరైన్ అరిదమన్ అని తెలిపారు. దీంతో సముద్ర ఆధారిత అణు నిరోధకశక్తి మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ ఆధ్వర్యంలో పని చేస్తున్న నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెబోరెటరీ (ఎన్ఎస్టీఎల్)ను రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు. అందులోని కావిటేషన్ టన్నెల్‌కు సైతం ఆయన శంకుస్థాపన చేశారు.
నూక్లియర్ మిసైల్స్ ను ప్రయోగించే:- భారతదేశం 2016లో ఐఎన్ఎస్ అరిహంత్, 2024 ఆగస్టులో ఐఎన్ఎస్ అరిఘాట్లకు తొడుగా ఐఎన్ఎస్ అరిదమన్ చేర్చింది. అరిదమన్ చేరికతో, అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములను సొంతంగా నిర్మించి, నిర్వహిస్తున్న అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా వంటి ఎంపిక చేసిన దేశాల క్లబ్లో భారతదేశం చేరింది. ఈ జలాంతర్గాములు శుత్రువుల కంటపడకుండా నెలల తరబడి సముద్రగర్భంలో ఉంటాయి. శత్రు దేశాల నుంచి అణు దాడి జరిగితే, సముద్రం లోపలి నుంచే నూక్లియర్ మిసైల్స్ ను ప్రయోగించే సామర్ద్యం వీటికి వుంటుంది.

