కౌంటర్ డ్రోన్ సిస్టమ్ “భార్గవాస్త్ర” ను విజయవంతంగా పరీక్షించిన భారత్
అమరావతి: ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉగ్రవాద దేశం అయిన పాకిస్థాన్ ఎక్కువగా డ్రోన్లతో భారత్ పై దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో,, డ్రోన్ దాడులను సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ “భార్గవాస్త్ర” ను విజయవంతంగా పరీక్షించింది..సోలార్ డిఫెన్స్, ఏరోస్పేస్ లిమిటెడ్ (SDAL) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సిస్టమ్‌ను భారత్ నేడు ఒడిశాలోని గోపాల్‌పూర్ లో వున్న సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి పరీక్షించారు.. మూడుసార్లు పరీక్షించగా,, భార్గవాస్త్ర,,రాకెట్ టార్గెట్‌ను కచ్చితత్వంతో చేధించినట్లు అధికారులు వెల్లడించారు..ఈ భార్గవాస్త్ర డ్రోన్ గుంపును తాలుక (swarm drone) ముప్పును ఎదుర్కోవడంలో చాలా కీలకం..
భార్గవాస్త్ర అనేది ఒక కౌంటర్ డ్రోన్ వ్యవస్థ..ఈ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ 2.5 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించగలదు..ఈ వ్యవస్థ ఇప్పటికే ఉన్న మన నెట్‌వర్క్-కేంద్రీకృత యుద్ధ మౌలిక సదుపాయాలతో దిన్ని అనుసంధానిస్తారు.. దీని కమాండ్-అండ్-కంట్రోల్ సెంటర్ అధునాతన C4I టెక్నాలజీని కలిగి ఉంటుంది..ఈ రాడార్ 6 నుంచి 10 కి.మీ దూరంలో ఉన్న చిన్న వైమానిక ప్రమాదలను కూడా గుర్తిస్తూంది.. ఎలక్ట్రో-ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ సూట్ తక్కువ రాడార్ క్రాస్-సెక్షన్ లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించేలా చేస్తుంది..ఇది గైడెడ్ మైక్రో బాంబులను ఉపయోగించి వాటిని నిర్వీర్యం చేస్తుంది..భార్గవాస్త్ర వ్యవస్థలో ఒకే సమయంలో 64 మైక్రో క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉంది.. ఎక్కడికైనా సులువుగా,,వేగంగా తరలించవచ్చు.. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కోసం అభివృద్ధి చేసిన మొట్టమొదటి మైక్రో క్షిపణి ఆధారిత కౌంటర్-డ్రోన్ వ్యవస్థ ఇది..