శ్రీలంకకు పెట్రోల్,ఢిజీల్ సహయం చేసిన భారతదేశం
అమరావతి: పశ్చిమ ఆసియా సంక్షోభం-హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ద్వీప దేశం అయిన శ్రీలంక తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇంధన సంక్షోభం కారణంగా అక్కడ విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. శ్రీలంక ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ఇంధనాన్ని రేషన్ పద్ధతిలో పంపిణీ చేయడంతో పాటు ఇతర చర్యలు తీసుకుంటున్నప్పటికి లంకలో దారుణమైన పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీంతో తమకు ఇంధనం సరఫరా చేయాలని శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే భారత్‌ను కోరారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. శ్రీలంక అధ్యక్షుడి విజ్ఞప్తి మేరకు భారత్ 38 వేల మెట్రిక్ టన్నుల ఇంధనాన్ని పంపింది. ఇందులో డీజిల్ 20 వేల మెట్రిక్ టన్నులు, పెట్రోల్ 18 వేల మెట్రిక్ టన్నులు. భారత్ నుంచి బయలుదేరిన ట్యాంకర్ నౌక, కొలంబో పోర్టుకు చేరుకున్నట్టు కొలంబోలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. క్లిష్ట పరిస్థితుల్లో సహాయం అందించినందుకు భారత ప్రభుత్వానికి శ్రీలంక అధ్యక్షుడు ధన్యవాదాలు తెలిపారు.అలాగే అక్కడి ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస కూడా భారత్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

