ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో స్వేఛ్చ వాణ్యిజం ఒప్పందాలు
అమరావతి: ప్రపంచంలోని పలు దేశాలతో భారతదేశం స్వేఛ్చ వాణ్యిజం ఒప్పందాలను చేసుకుంటు దూసుకుని వెళ్లుతొంది.అమెరికా విధిస్తూన్న టారిఫ్ లకు సరైన జావాబు చేప్పే దిశగా వ్యుహత్మకు అడుగులు వేస్తుంది. ఇందులో బాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మూడు రోజుల విదేశీ పర్యటనల్లో గల్ఫ్ దేశాలతో తన ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేశారు. ఇందులో భాగంగా ఒమన్‌తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై సంతకం చేసేందుకు భారత్ సిద్ధమైంది. ఒమన్ ఒక దేశంతో కుదుర్చుకుంటున్న రెండో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య వ్యాపార లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి. ఒమన్ దేశం గత 20 సంవత్సరాల్లో ఇలాంటి ఒక పెద్ద ఒప్పందాన్ని చేసుకోవడం ఇదే మొదటిసారి. ఈ ఒప్పందం ద్వారా భారతీయ వస్తువులు ఒమన్ మార్కెట్‌లోకి ఎటువంటి అదనపు పన్నులు లేకుండా లేదా తక్కువ పన్నులతో ప్రవేశిస్తాయి. దీనివల్ల మన దేశంలోని రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులకు భారీ లాభాలు చేకూరుతాయి. అలాగే పెట్టుబడులు పెరగడం వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు మారుతున్న వేళ వస్తువుల సరఫరా చైన్ ఆగిపోకుండా ఉండేందుకు ఈ స్నేహపూర్వక ఒప్పందం ఎంతో కీలకం.
భారత్ త్వరలోనే ప్రపంచంలోనే పెద్ద 3వ ఆర్థిక వ్యవస్థ:- ఇరు దేశాల మధ్య కుదురుతున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 21వ శతాబ్దపు భాగస్వామ్యానికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాబోయే దశాబ్దాల పాటు ఇరు దేశాల ఆర్థిక గమనాన్ని మారుస్తుందని ఆయన ఆకాంక్షించారు. భారత్ త్వరలోనే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. భారత్ అభివృద్ధి చెందితే అది తన స్నేహపూర్వక దేశాల అభివృద్ధికి కూడా దోహదపడుతుందని, ముఖ్యంగా సముద్ర పొరుగు దేశమైన ఒమన్‌కు ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. భారత్ ఎప్పుడూ స్వావలంబన, ప్రగతిశీల ఆలోచనలతో ముందుకు సాగుతుందని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అమెరికా టారిఫ్ బెదిరింపులకు ధీటుగా:- బ్రిటన్:– 90 శాతం వస్తువులపై పన్నులు తగ్గడం వల్ల మన వ్యాపారం విస్తరించింది. స్విట్జర్లాండ్, నార్వే:– ఈ దేశాల నుంచి భారత్‌కు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.ఆస్ట్రేలియా:– మన ఎగుమతులకు కొత్త మార్కెట్లు లభించాయి.UAE:– బంగారం, నగలు, బట్టలు మరియు ఇంజనీరింగ్ వస్తువుల వ్యాపారం పెరిగింది. మారిషస్:– ఆఫ్రికా దేశాలకు మన వస్తువులను పంపడానికి ఇది చాలా కీలకంగా మారింది.

