ఇరాన్‌పై సైనిక దాడులను 5 రోజులు వాయిదా వేసున్నాం-డొనాల్డ్ ట్రంప్
అమరావతి: 48 గంటల్లోగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరవకపోతే, ఇరాన్ లోని విద్యుత్ కేంద్రాలను “తుడిచిపెట్టేస్తానని” శనివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సోమవారం రాత్రితో ఈ గడువు ముగిస్తున్ననేపధ్యంలో ఇరాన్‌పై సైనిక దాడులను 5 రోజులు వాయిదా వేసినట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రెండ్రోజులుగా వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని, చర్చలు సజావుగా, నిర్మాణాత్మకంగా ఉన్నాయని చెప్పారు. ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నాలుగో వారంలోకి చేరుకోగా, తొలిసారి ట్రంప్ ప్రకటనతో ఉద్రిక్తతలు తగ్గేందుకు అవకాశాలున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతాయని, వాటి ఫలితంపై ఆధారపడి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ఏవైనా షరతులకు అంగీకరించడం కానీ లాంఛనంగా చర్చలు ప్రారంభం కావడంపై ఇరాన్ ఇంకా స్పందించలేదు.


