NATIONALPOLITICS

నామినేషన్లు దాఖలు చేసిన DMK స్టాలిన్,TVK జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్

అమరావతి: తమిళనాడు ముఖ్యమంత్రి, DMK అధినేత MK స్టాలిన్ చెన్నైలోని కొళత్తూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టాలిన్ రోడ్ షో నిర్వహించారు. కొళత్తూర్‌ నుంచి స్టాలిన్ నామినేషన్ వేయడం ఇది నాలుగోసారి. నామినేషన్​ అనంతరం మాట్లాడిన స్టాలిన్, కొళత్తూర్‌ ప్రజలు తనకు వరుసగా నాలుగోసారి అఖండ విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

టీవీకే అధినేత విజయ్:- టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పెరంబూర్​ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో విజయ్​ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. తిరుచ్చి ఈస్ట్​ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. నామినేషన్​ అనంతరం విజయ్​ రోడ్​ షో నిర్వహించారు. ఏప్రిల్​ 23న జరిగే ఎన్నికల్లో విజిల్​ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *