నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు-వివరాలను కచ్చితంగా పొందుపరచాలి-కలెక్టర్
నెల్లూరు: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు చెత్త సేకరణ, డీసిల్రేషన్, డ్రైన్ల మరమ్మత్తులకు సంబంధించి నిర్దేశిత నమూనాలలో హిమాన్షు శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి కమిటీ తొలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కమిటీలో చైర్మన్గా జిల్లా కలెక్టర్, మెంబర్ కన్వీనర్ గా నగర పాలక సంస్థ కమిషనర్, మెంబర్లుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ ఈ-మున్సిపల్ కమిషనర్లు ఉంటారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా నాలుగు రకాల డ్రైన్స్ ఉంటాయని మేజర్, మీడియం,నల్లాలు ఉంటాయన్నారు. మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలోని సిబ్బందితో సమావేశాలు నిర్వహించి అవసరమైన సూచనలు సలహాలు అందజేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్ణీత ప్రొఫార్మాలో వివరాలు పొందుపరచాలన్నారు. తడి చెత్త ,పొడి చెత్త వేరు చేయడం కాలువలలో పూడిక తీయడం వంటి పనులు నిర్ణీత సమయాల్లో పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా డ్రైన్స్ విషయంలో దృష్టి పెట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ నందన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్ కుమార్, హెల్త్ ఆఫీసర్ కనకాద్రి, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

