విద్యార్ధులలో నైతికత, క్రమశిక్షణ, సమాజం పట్ల గౌరవం అవసరం-కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు: విద్యార్ధులలో నైతికత, క్రమశిక్షణ, సమాజం పట్ల గౌరవం పెంపోదించే విధముగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచానాలు ఎంతో ఉపయోగ పడతాయని, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆద్వర్యంలో కస్తురిభా కళా క్షేత్రములో విలువల విద్యా సదస్సు పై ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువారం ప్రవచనం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖల అభివురుద్ధికి తగు సూచనలు, సలాహాలు కోసం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును ప్రభుత్వ సలహా దారునిగా నియమించినదని తెలిపారు. భారతీయ సనాతన ధర్మాలతోపాటు, తల్లి తండ్రులు, గురువుల పట్ల, నైతిక విలువలు తెలియచేసి విద్యార్ధులలో అవగాహన అవసరం అన్నారు. ప్రభుత్వ సలాహా దారునిగా ఆయన ఆలోచనలు, అనుభవాలు ఎంతో ఉపయోకరమని తెలిపారు .వారి ప్రవచనాలు జీవన మార్గ దర్శకమని ,సమాజ మార్పునునకు ఉపయోగపడతాయని అన్నారు. జ్ఞానం మార్గాన్ని, విలువలు గమ్యానికి చేరుస్తాయని ఆయన తెలిపారు. ఉపాద్యాయులు, విద్యా వేత్తలు విద్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
యస్.సి.ఈ.ఆర్.టి , డైరెక్టర్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు నెల్లూరులో నిర్వచించు కోవడం గొప్ప విషయమని పరోక్షంగా వారి ప్రవచనాలు వినడమే అని నేడు ప్రత్యక్షంగా వినడం సంతోషదాయకం అన్నారు.
అనంతరం చాగంటి కోటేశ్వరరావు, విలువలు విద్యా సదస్సు పై సుమారుగా 45 నిముషాల పాటు పిల్లలను, ఉపాధ్యాయులను, పిల్లల తల్లి తండ్రులను ఉద్దేశించి ప్రవచించించారు.కార్యక్రమ అనంతరం పలువురు విద్యార్ధిని విద్యార్దులు నవ్యశ్రీ, సందీప్,మేఘన, ఆస్మిన్, ధనలక్షి,నిఖిల్ అడిగిన ప్రశ్నలకు పిల్లలకు అర్ధమయ్యేలా వివరించారు. తదుపరి చాగంటి కోటేశ్వర రావును సముచిత రీతిలో సత్కరించారు. ఈ కార్యక్రమములో విద్యా శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలాకులు లింగేశ్వర రెడ్డి, విధ్యాసాఖాదికారులు, విద్యార్ధినీ విద్యార్ధులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

