నెల్లూరులో ఆయుష్ హోమియోపతి డిస్పెన్సరీకి మంత్రి నారాయణ శంకుస్థాపన
నెల్లూరు: నగర అభివృద్ధితో పాటు పేద ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరం 47వ డివిజన్లో సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆయుష్ హోమియోపతి డిస్పెన్సరీ భవనానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు.. మంత్రి నారాయణ మాట్లాడుతూ.. దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న స్వర్ణకారులు-నిరుపేదల చిరకాల వాంఛను నెరవేరుస్తూ, శిథిలావస్థకు చేరిన పాత కేంద్రాన్ని పునర్నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ భవన నిర్మాణాన్ని కేవలం 3 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు..30 ఏళ్ల క్రితమే ఆసుపత్రి కోసం స్థలాన్ని దానం చేసిన గూడూరు మునిస్వామి నాయుడి సేవా దృక్పథాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.. మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని ఇచ్చిన హామీలే కాకుండా, ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్నాం” అని మంత్రి పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ‘ప్రజా దర్బార్’ల ద్వారా అగ్రతాంబూలం ఇస్తున్నామని తెలిపారు..నెల్లూరు నగరాన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని, కాలువల ఆధునీకరణ ద్వారా నగరానికి ముంపు ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అభివృద్ధిని అడ్డుకునే కుట్రదారుల మాటలను ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

