పార్టీ కోసం అహర్నిసలు కష్టపడిన కార్యకర్తలను సన్మానించిన మంత్రి నారాయణ
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు శ్రమించిన తొమ్మిది మంది క్రియాశీలక సభ్యులను గోమతి నగర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారాయణ వేదికపై ప్రత్యేకంగా సన్మానించారు.ఈ సందర్బంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ, మెంబర్‌షిప్ డ్రైవ్, సుపరిపాలన- ఐటీడీపీ యాప్ వంటి కార్యక్రమాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మామిడాల మధు,కపిర శ్రీనివాసులు, కాకర్ల తిరుమలరావు, పొత్తూరి శైలజ, మహేష్, కలివేటి రవి, ఎగుటూరి సతీష్, తురిమెర్ల పెంచలయ్య-ఐటీడీపీ నుండి సుధాకర్ బాబును నిబద్ధతను రాష్ట్ర పార్టీ ప్రత్యేకంగా గుర్తించిందన్నారు. వీరి అంకితభావాన్ని అభినందిస్తూ మంత్రి నారాయణ వీరిని సత్కరించారు. క్రమశిక్షణతో పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, ఈ తొమ్మిది మంది కృషి మిగతా వారందరికీ ఆదర్శమని మంత్రి పేర్కొన్నారు.సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషిచేస్తామని సన్మాన గ్రహీతలతో పాటు పార్టీ కార్యకర్తలు ,నేతలతో ప్రతిజ్ఞ చేయించారు.

