నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇంటి ఇంటి సర్వేతో పాటు మ్యాపింగ్ చేయాలి-నందన్
నెల్లూరు: నగర పాలక సంస్థ 117 నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన 248 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఎలక్షన్ సిబ్బందితో ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ERO) అయిన కమీషనర్ నందన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో భాగంగా సిటీ నియోజకవర్గంలోని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు సంబంధించి ఓటర్లను మ్యాపింగ్ చేసే ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్ల స్థాయిలో పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ.ఆర్.ఓ మాట్లాడుతూ ప్రతి బూత్ లెవల్ అధికారి ఇంటి ఇంటి సర్వే నిర్వహించి మ్యాపింగ్ నిర్వహించాలని సూచించారు. విధుల నిర్వహణలో కొంతమంది BLO లు మ్యాపింగ్ సరిగా నిర్వహిస్తున్నారని, కొంతమంది మ్యాపింగ్ విషయంలో అశ్రద్ధ కనపరుస్తున్నారని అలాగే మ్యాపింగ్ బాగా నిర్వహించిన బూత్ లెవెల్ అధికారుల చేత వారు చేసిన విధానాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరించారు. అలాగే తక్కువ శాతం పూర్తి చేసిన బి.ఎల్.ఓ లను సూపర్వైజర్ లు ప్రతిరోజు పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే ఇంటింటి సర్వే పూర్తి చేసేందుకు స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు, బూత్ లెవెల్ ఎజెంట్ల సహకారంతో నిర్దేశించిన సమయం లోపల పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏ.ఈ.ఆర్.ఓ షఫీ మాలిక్, ఎలక్షన్ డిప్యూటీ తాసిల్దార్ ఆనంద్, సూపర్వైజర్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లు, ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.

