జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్
నెల్లూరు: 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో నేషనల్ ఓటర్స్ డే ని జిల్లాఎన్నికల అధికారి-కలెక్టర్ హిమాన్షు శుక్లా హాజరైన ఉద్యోగస్తులతో జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1950, జనవరి-25వ తేదీన భారత ఎన్నికల సంఘం ఏర్పడిన సందర్భంగా జనవరి-25, 2011 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఓటర్ల నమోదు పెంచడం, ఓటు హక్కు పై అవగాహన కల్పించడం, యువతను ఓటరుగా నమోదుకై ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని ఆయన ఈ సందర్బంగా సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, జిల్లా రెవిన్యూ అధికారి విజయకుమార్, కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

