నేటి అర్ధరాత్రి నుంచి అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ మూసివేత- కమిషనర్ నందన్
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలో తూర్పు పడమర ప్రాంతాలను అనుసంధానం చేసే ప్రధానమైన అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ మరమ్మత్తు పనుల దృష్ట్యా నేటి అర్ధరాత్రి నుంచి మూసివేస్తున్నట్లు కమిషనర్ వై.ఓ నందన్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి వచ్చే ఏడాది జనవరి నెల 10వ తేదీ వరకు మరమ్మతు పనులను చేపట్టి ఫ్లైఓవర్ ను ఆధునికరించనున్నామని కమిషనర్ వివరించారు. బ్రిడ్జిపై ఉన్న 20 జాయింట్లు పూర్తిస్థాయిలో దెబ్బతిని వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉన్న కారణంగా ఇంజనీరింగ్ విభాగం అధికారుల నేతృత్వంలో పూర్తిస్థాయిలో ఆధునికరించనున్నామని కమిషనర్ స్పష్టం చేశారు.వాహనదారులు సమన్వయం పాటించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణం చెయాల్సిందిగా కమిషనర్ విజ్ఞప్తి చేశారు .

