DEVOTIONALDISTRICTSOTHERS

ఈనెల 26 నుంచి శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

నెల్లూరు: నరసింహకొండ వద్ద వెలసియున్న శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వాలు ఈనెల 26 వతేదీ నుండి మే 6వ తేదీ వరకు నిర్వహించనున్న నేపధ్యంలో బక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగా కుండా నిర్వహించాలని (RDO) రెవిన్యూ డివిజినల్ అధికారి అనుషా సంబంధిత అధికారులకు సూచించారు.శనివారం నరసింహ కొండలోని సమావేశ హాలులో బ్రహ్మోత్సవాలు నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గత సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహణ సమయములో వచ్చిన లోటుపాట్లను పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.ఆలయ చైర్మన్ అచ్యుత శంకర్ రెడ్డి,టీడీపీ నాయకుడు కోటంరెడ్డి.గిరిధర్ రెడ్డి లు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమములో వివిధ శాఖ అధికారులు, ఆలయ ధర్మ కర్తలు తదితరులు పాల్గొన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *