CRIMEDISTRICTS

కొడవలూరు వద్ద ఇద్దరు యువకులు దారుణ హత్య?

నెల్లూరు: నెల్లూరుజిల్లా,కొడవలూరు మండలం గండవరం వద్ద ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురైయ్యారు. వ్యవసాయ పనులు నిమిత్తం గడ్డి మిషన్ కు డీజిల్ తీసుకుని దగదర్తి మండలం పెద్దపుద్దేడు గ్రామానికి చెందిన వెంకటేష్(29), సంగం మండలం వెంగరెడ్డి పాలెంకు చెందిన బాల వెంకయ్య(26)తో కలసి బైక్ పై వెళ్లారు. కొడవలూరు మండలం గండవరం నుంచి వెళుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై కత్తిలతో దాడి చేయడంతో, ఇద్దరు మృతి చెంది వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పాత కక్షలతోనే హత్య జరిగిందా లేదా ఇతర కారణాలతోనా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *