తిరువనంతపురం వయా ఆంధ్ర,తెలంగాణ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రల ప్రయాణికులకు సేవాలు అందించేందుకు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ అందుబాటులోకి రాబోతోంది. జనవరి 23వ తేదిన (17042) కేరళలోని తిరువనంతపురం నుంచి ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. తిరువనంతపురం-చర్లపల్లి మధ్య ఈ అమృత భారత్ రైలు పరుగులు తీయనున్నది.
ఈ రైలు ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి ఉదయం 7.15కు బయలుదేరి,,మరుసటి రోజు మధ్యాహ్నం 2.45కు తిరువనంతపురం చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరిగి (17041 )బుధవారం సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి, తరువాత రోజు రాత్రి 11.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
అమృత భారత్ రైలు స్టాపింగ్స్:- కేరళ వర్కాల శివగిరి, కొల్లాం, కరునాగపల్లి, కాయంకుళం, మావేలికర, చెన్హన్నూర్, తిరువళ్ల, చంగనస్సేరి, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, అలువా, త్రిస్సూర్, పాలక్కాడ్, కోయంబత్తూరు, తిర్ప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేటై, కాట్పాడి, తిరుత్తణి, రేణిగుంట, నెల్లూరు,ఒంగొలు,బాపట్ల,తెనాలి, గుంటూరు, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది.

