ఈ సంవత్సరం విద్యుత్ ఛార్జీల పెంచే లేదు- సీఎం చంద్రబాబు
అమరావతి: ఈ సంవత్సరం విద్యుత్ ఛార్జీల పెంచే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.. బుధవారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేస్తూ, వృద్ధిరేటు పెంపునకు రానున్న నాలుగు నెలల్లో తీసుకోవాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై సూచనలు చేశారు. ప్రభుత్వం 32వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, విద్యుత్ శాఖకు కోటి పది లక్షల కోట్లు అప్పులు చేశారని చంద్రబాబు అన్నారు. పీపీఎలను రద్దు చేసి గత ప్రభుత్వం రూ.9 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో బహిరంగ మార్కెట్‌లో యూనిట్ విద్యుత్‌ను రూ.5.19 చొప్పున కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు దానిని రూ.4.92కు తగ్గించామని చెప్పారు. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ అనుకున్నంతగా ఫలితాలు రావడం లేదని,, అందరికీ జనవరి 15వ తేదీ వరకు డెడ్ లైన్. ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేశారు. ఆటు తరువాత ఆశించిన మేర ఫలితాలు రాకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు.

