వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది-విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి: నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల్లోని వాయుగుండం (దిత్వా అవశేషం) తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో బుధవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందిని తెలిపింది.

