తెలంగాణలో దిగ్విజయంగా క్రీడా కార్యక్రమాలు- స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి
హైదరాబాద్: 48 సంవత్సరాల తర్వాత హైదరాబాదు నగరంలో జాతీయ సీనియర్ ఆర్చరీ పోటీలు నిర్వహించడం సంతోషంగా వుందని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవి అన్నారు. బుధవారం బేగంపేట పబ్లిక్ స్కూల్ లో జరుగుతున్న 45వ సీనియర్ జాతీయ ఆర్చరీ పోటీల్లో రికర్వ్ విభాగానికి చెందిన పోటీలను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంలో అమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో హైదరాబాద్ నగరంలో-తెలంగాణలో వివిధ క్రీడా కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించగలుగుతున్నామని అన్నారు. హైదరాబాద్ నగరం స్పోర్ట్స్ హబ్ గా మారేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడుతున్నాయని వెల్లడించారు.క్రీడా శాఖ ఇస్తున్న ప్రోత్సాహక విధానాలతో మరిన్ని క్రీడా కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ కిషోర్ గోపీనాథ్, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పరిపాలన అధికారి గుంజన్ అబ్రహం, తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు టి రాజు ప్రధాన కార్యదర్శి అరవింద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

