నా వ్యక్తిత్వ హక్కులను కాపాడండి-ఢిల్లీ కోర్టుకు పవన్ కళ్యాణ్
అమరావతి: వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు..కొంత మంది వ్యక్తులు,సంస్థలు ఉల్లంఘనలకు పాల్పడుతూ తన ఫోటోలు వీడియోలను దుర్వినియోగం చేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఇప్పటికే సీనియర్ హీరోలు చిరంజీవి నాగార్జున ఇదేవిధంగా కోర్టు నుంచి రక్షణ పొందగా ఇపుడు పవన్ కూడా అదే తరహాలో కోర్టుకు వెళ్లారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన,,అనైతికమైన రాతలు,ఫోటోలు,వీడియోలతో విసిగైతిన సినీ నటులు కోర్టుల ద్వారా తమ హక్కులు భద్రతను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

