అదుపు తప్పి లోయలో పడిన ప్రైవేట్ బస్సు-9 మంది యాత్రికుల మృతి
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు-ప్రధాని మోదీ..
అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ సంఘటనలో 9 మంది మృతి చెందారు,,మృతుల సంఖ్య పెరిగే అవకాశం కన్పిస్తొంది.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌రోడ్డు వద్ద అదుపు తప్పి ప్రైవేటు బస్సు లోయలో పడింది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ బస్సుగా గుర్తించారు. ఈ ప్రమాదం జరిగిన సందర్భంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు సహా 35 మంది యాత్రికులు ఉన్నారు. బస్సు నెంబర్: AP 39 UM 654. భద్రాచలంలో ఆలయ దర్శనం చేసుకొని అన్నవరానికి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.
చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌రోడ్డు వద్ద రాజుగారిమెట్ట మలుపు వద్ద అదుపు తప్పి బస్సు లోయలో పడింది. దీంతో ఘాట్‌రోడ్డు వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సంఘటనా స్థలిలో 3 అంబులెన్సులు, 5 పోలీస్ వాహనాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
సిఎం చంద్రబాబు:- అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్ లో బస్సు ప్రమాదంపై సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.బస్సు ప్రమాదం,క్షతగాత్రులకు అందుతున్న సాయంపై అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. అన్ని శాఖలు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సిఎం ఆదేశం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్:- అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్ లో బస్సు ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ,బస్సు లోయలోపడి ప్రయాణీకుల దుర్మరణం బాధాకరం అన్నారు.ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారని తెలిసి చింతిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుంది.
చింతూరు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి:- మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రధాని మోదీ ప్రకటించారు.
మృతుల వివరాలు:- శ్రీ కళా,,సునందా,,శివశంకర్ రెడ్డి,,ఉమారెడ్డి,,కృష్ణ కుమారి,,రఘరా మధు,,పొంగుల ప్రసాద్,,ఇంకా 2 మృతదేహాలు గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

