గిరి పుత్రుల మధ్య పార్టీ పతాకాన్ని అవిష్కరించిన జనసేనాని
అమరావతి: జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాడేరు నియోజక వర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో గిరి పుత్రుల మధ్య పార్టీ పతాకాన్ని శనివారం జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య తదితరులు హాజరయ్యారు.

