అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు ఐటీశాఖ ఉత్తర్వులు జారీ
2026 జనవరి 1వ తేది నాటికి..
అమరావతి: ఏ.పి ఉమ్మడి రాజధాని హైదరాబద్ కంటే మిన్నగా ఐటీ రంగంలో అమరావతికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు సీ.ఎం చంద్రబాబు సారధ్యంలో కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తొంది..ఇందులో బాగంగా రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు చేసుకున్న MoUను ర్యాటిఫై చేస్తూ శనివారం ఐటీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది..
2026 జనవరి 1వ తేది నాటికి అమరావతి:- రాజధానిలో అధునాతన క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ సిద్ధం కానుంది..అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కును అగ్రశ్రేణి ఐటీ సంస్థలు TCS,,,L&T,,IBM సంస్థలు నిర్మాణం చేపట్టనున్నాయి..క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి ఈ మూడు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం చేసుకుంది..క్వాంటం కంప్యూటింగ్ పార్కులో అధునాతన 156 క్యూబిట్ క్వాంటం సిస్టం 2 ను IBM సంస్థ ఏర్పాటు చేయనుంది..క్యాంటం కంప్యూటింగ్ సర్వీసెస్,,సొల్యూషన్స్ తో పాటు పరిశోధన,, హైబ్రీడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్‌ను TCS అందించనుంది..వైద్యారోగ్యం,,ఆర్ధిక,,ఉత్పత్తి,, విద్యా రంగాలకు చెందిన వివిధ అప్లికేషన్లు,,పరిశోధన సహకారాన్ని అందించేలా TCSతో ఒప్పందం కుదుర్చుకుంది.. క్లయింట్ నెట్ వర్క్ తో పాటు స్టార్టప్ లు,,ఇతర ప్రాజెక్టుల నిర్వహణ,,ఇంజనీరింగ్ నైపుణ్యాలను L&T సంస్థ అందించనుంది..