AP&TG

మార్చి  నుంచే ఎక్కవ ఉష్ణోగ్రతలు-ఏప్రిల్‌, మే నెలల్లో తీవ్రతరం- విపత్తుల  నిర్వహణ సంస్థ

ఆకస్మికంగా భారీవర్షాలు

అమరావతి: రాష్ట్రంలో ఎండలు నెమ్మదిగా ముదురుతున్నాయి. మార్చి మొదట వారం నుంచే సూర్యుడి ప్రతాపం కన్నిస్తొంది. మార్చి, ఏప్రిల్‌, మే లో తీవ్రతరం కానున్నాయి. ఈ ఏడాది కూడా ఏప్రిల్‌, మే నెలలతోపాటు మార్చి నుంచే ఎండల తీవ్రత క్రమేపీ పెరగనుందని, దీంతోపాటు వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ బులెటిన్‌లో పేర్కొందని విపత్తుల సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. మార్చి నెలలో శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉందని అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో వడగాలులు ఎక్కవ రోజులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.

ఆకస్మికంగా భారీవర్షాలు:- విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు ఎండతీవ్రతపై ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తుందన్నారు. జిల్లాయంత్రాంగం సమన్వయ చర్యలతో ప్రాణనష్టాన్ని తగ్గించగలుగుతుందన్నారు. ఎండ తీవ్రత అంచనాల నేపధ్యంలో జిల్లా అధికారులు దృష్టి సారించాలని ఇప్చటికే సూచనలు జారీ చేశామన్నారు. అలాగే ఎండలతో పాటు క్యుములోనింబస్ మేఘాల వలన ఆకస్మికంగా భారీవర్షాలు, పిడుగులు పడే అవకాశం వున్నందున చెట్ల క్రింద ఉండకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *