AP&TG

నగరంలో ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త మాత్రమే-పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్

హైదరాబాద్: నగరంలో ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త మాత్రమే అని, దీని వల్ల ప్రజలు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.  ప్రస్తుతం HPCL, IOCL, BPCL వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని, సరఫరా గొలుసు ఎక్కడా ఆగలేదని వెల్లడించారు.

తప్పుడు వార్తాల కారణంగా ప్రజలు ఒక్కసారిగా కొనుగోలు చేయడం వల్ల సాధారణం కంటే 2.5 నుండి 3 రెట్లు విక్రయాలు పెరిగాయని తెలిపారు. దీని వల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోవచ్చు, కానీ అది కొరత కాదన్నారు. పెట్రోల్ లేదా డీజిల్‌ను డబ్బాల్లో, క్యాన్లలో నింపి నిల్వ చేయడం PESO నిబంధనలకు విరుద్ధం అని,ఇది చాలా ప్రమాదకరం, అగ్ని ప్రమాదాలకు దారి తీయవచ్చు అని వెల్లడించారు. ప్రజలు తమకు అవసరమైనంత మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, అనవసరంగా నిల్వ చేయవద్దని అసోసియేషన్ కోరింది. తప్పుడు వార్తలను నమ్మకండి లేదా ప్రచారం చేయకండి అని కోరింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *