పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా,అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే-సీ.ఎం చంద్రబాబు
అమరావతి: పీపీపీ పద్దతిన మెడికల్ కాలేజీల నిర్మాణంపై ప్రతిపక్షపార్టీలు ప్రజలను తప్పుదారి పట్టించే పద్దతిలో ఆరోపణలు చేస్తున్నారని,,అయతే పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా,,అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు.బుదవారం రాష్ట్ర సచివాలయంలో 17,18 తేదీల్లో జరుగుతున్న కలక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పీపీపీ ద్వారా మెరుగ్గా సేవలు అందుతాయని,,వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారని,, మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందన్నారు. 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లో అందుతాయి, సీట్లు కూడా పెరిగాయన్నారు. విమర్శలు చేస్తే భయపడేది లేదు. వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోందని వెల్లడించారు. రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారు. కానీ అది ప్రైవేటు వ్యక్తులది అయిపోతుందా..అంటూ ప్రశ్నించారు.
రుషికొండ ప్యాలెస్:- రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారని,,ఆ డబ్బు ఉంటే రెండు మెడికల్ కాలేజీలను నిర్మించే వాళ్లం అన్నారు. రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు ఓ వైట్ ఎలిఫెంట్ గా మారిందని అన్నారు.
13-14 శాతంతో అప్పులు:- గత ప్రభుత్వంలో చేసిన తప్పులు చాలా ఉన్నాయని,,అత్యధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు. 13-14 శాతంతో అప్పులు తీసుకువచ్చి సమస్య సృష్టించారని తెలిపారు.జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవారని,వారు చేసిన అనాలోచిత ధోరణితో ఎస్టాబ్లిష్ మెంట్ వ్యయం భారీగా చేశారని వెల్లడించారు.ఇప్పుడు అప్పులు రీ-షెడ్యూలు చేస్తున్నాం. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికతో అప్పులను రీ-షెడ్యూలింగ్ చేస్తున్నాం అని చెప్పారు.
సచివాలయం 5వ బ్లాక్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 5వ జిల్లా కలెక్టర్ల సదస్సు. హాజరైన సీఎస్ విజయానంద్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలు హాజరు అయ్యారు.

