వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
అమరావతి: గుంటూరు జిల్లా వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు టీడీపీ శ్రేణులకు మధ్య శనివారం ఉద్రికత్త వాతావరణం నెలకొంది..నేపధ్యం….తిరుమల లడ్డులో నెయ్యి కల్తీపై గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఉద్రిక్తతకు కారణమైంది. గోరంట్లలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మహాపాపం పేరుతో టీడీపీ నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని తొలగించాలని లేకుంటే తామే తొలగిస్తామని వైసీపీ నేత అంబటి రాంబాబు శుక్రవారం చెప్పారు.శనివారం గోరంట్ల వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన, అంబటి ఫ్లెక్సీ వద్దకు వస్తామని ప్రకటించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం ఉదయం ఫ్లెక్సీ వద్దకు భారీగా చేరుకున్నారు. గొడవలు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబటి రాంబాబును ఫ్లెక్సీ వద్దకు రావొద్దని కోరారు.
ఆసభ్య పదజాలం:- ఇదే సమయంలో ఆలయంలో పూజల తరువాత అంబటి ఆ మార్గంలో వెళ్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. రాంబాబు వాహనం దిగేందుకు ప్రయత్నించగా పోలీసులు వారించారు. ఆగ్రహంతో ఊగిపోయిన అంబటి రాంబాబు టీడీపీ శ్రేణులను,,ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి..రమ్మను లం…. కొడుకులను…వాడి అమ్మమొగడు అయిన రమ్మను అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అంబటి రాంబాబును పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు.
అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత:- చంద్రబాబుపై అంబటి రాంబాబు ఉపయోగించిన ఆసభ్య వ్యాఖ్యలను రాష్ట్రవ్యాప్తంగా కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. బరితెగించి మాట్లాడిన అంబటి రాంబాబు చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.అలాగే అంబటి రాంబాబుపై గుంటూరు జిల్లా ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ శ్రేణులు,,అంబటి ఇంటిపై రాళ్లు రువ్వు,,కిటికీ అద్దాలు, పూలకుండీలు ధ్వంసం చేశారు.

