AP&TG

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

అమరావతి: వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది బాలాసోర్‌కు 50 కి.మీ., చాంద్‌బలికి 60 కి.మీ., అలాగే దిఘాకు 60 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.వాయుగుండం ప్రభావంతో సోమవారం విజయనగరం, మన్యం, అల్లూరి, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *