అర్హత లేని వారిని అందలం ఎక్కిస్తే రాష్ట్రానికి దుర్గతి పడుతుంది-సీ.ఎం చంద్రబాబు
1భూమినే జలాశయంగా మార్చుకునేలా..
నెల్లూరు: అర్హత లేని వారిని అందలం ఎక్కిస్తే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు సమస్యలు వస్తాయని,ఇలాంటి వ్యక్తులను జైల్లో పెట్టాలంటే ఒక్క నిమిుషం పని కానీ మేం ప్రతీకార రాజకీయాలు చేయటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.బుధవారం నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నపువారిపాలెంలో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగించారు. నేరాలు చేసే పార్టీ, నేరస్తులను కాపాడే పార్టీ, నేరస్తులతో రాజకీయాలు చేసే పార్టీని ఇప్పుడే చూస్తున్నామని, రాష్ట్రంలో రౌడీయిజం చేయాలన్నదే వైసీపీ నేతల ఆలోచనలు,గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అనే సంకల్పం ప్రజలు చేయాలని కోరుతున్నాను అని సీ.ఎం అన్నారు.
గొడ్డలి పార్టీ తీవ్రవాదుల తరహాలో అందరినీ భయాందోళనలకు గురి చేస్తోందని,రోజుకో ఫేక్ న్యూస్, రోజుకో విన్యాసంతో గొడ్డలి పార్టీ కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని విరుచక పడ్డారు.గొడ్డలి పార్టీ రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చేసింది. మేం అధికారంలోకి వచ్చాక ఈగల్ టాస్క్ ఫోర్సు ద్వారా నియంత్రించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ అవసరమైన రాజధాని అమరావతి గొడ్డలి పార్టీకి అవసరం లేదు కాబట్టే ఇంకా రాజధానిపై కుట్రలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వేగంగా పనులు జరుగుతుంటే సహించలేకపోతున్నారని ధ్వజమెత్తారు.
అమరావతి పరిరక్షణ అంటూ రౌడీలతో:- గత పాలకుడు తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాలతో రాష్ట్రానికి రాజధానే లేకుండా పోయిందని,మూడు రాజధానుల పేరిట గందరగోళ పరిచారన్నారు.ఎవరైనా పొరుగు రాష్ట్రాలకు వెళ్తే ఏపీకి మూడు రాజధానులా అని హేళనకు గురయ్యారని అవేదన వ్యక్తం చేశారు.పార్లమెంటులో శాశ్వత రాజధాని చట్టం చేస్తుంటే మావిగన్ అంటూ కొత్త ఆటలు మొదలు పెట్టారని, అమరావతి పరిరక్షణ కోసం అంటూ రౌడీలతో ఇప్పుడు దండయాత్ర చేస్తున్నారని ఇలాంటి వాటికి కూటమి బెదిరేది లేదని స్పష్టం చేశారు.
ప్రవాహాలు రాకపోయిన ప్రాజెక్టుల్లో 65 శాతం మేర నిల్వలు:- గత ఏడాది పడిన వర్షాలకు గోదావరి, కృష్ణానదులు పొంగి పొర్లాయి. ఆ సమయంలోనే రిజర్వాయర్లను నింపి వుంచడంతో ఈ ఏడాది ఇప్పటికీ నదుల్లో ప్రవాహాలు రాకపోయిన ప్రాజెక్టుల్లో 65 శాతం మేర నిల్వలు ఉన్నాయని తెలిపారు.అందుకే భూమినే జలాశయంగా మార్చుకునేలా జలధార లాంటి కార్యక్రమాలు చేపట్టాం అని తెలిపారు.నదుల అనుసంధానం చేసేలా ప్రణాళికలు కూడా చేపట్టాలని ఆలోచన చేస్తున్నామని, గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేస్తే దిగువ రాష్ట్రాలకూ నీరు ఇచ్చే పరిస్థితి ఉంటుందన్నారు.

