ఆఫ్ఘనిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భూకంపం-ఢీల్లీ పరిసరాల్లో ప్రకంపనలు
అమరావతి: ఆఫ్ఘనిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో దాని తాలుక ప్రకంపనలు శనివారం సాయంత్రం ఢిల్లీ-ఎన్‌సిఆర్, జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కన్పించాయి. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్‌తో పాటు ఢిల్లీ-ఎన్‌సిఆర్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లోనూ ప్రకంపనలు నమోదయ్యాయని ఎన్‌సీఎస్ తెలిపింది. ఒక్కసారిగా వచ్చిన భూప్రకంపనలతో,ప్రజలు ఇళ్ల నుంచి, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాథమిక భూకంప నివేదికల ప్రకారం, భారత కాలమానం ప్రకారం రాత్రి 7:04 గంటలకు భూమికి 215 కిలోమీటర్ల లోతులో శనివారం ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

