మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఏపీఎల్-2026 క్రికెట్ పోటీల సందడి
ముఖ్య అతిథిగా హీరో రామ్ చరణ్…
అమరావతి: మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో GMR APL-2026 క్రికెట్ టోర్నమెంట్ రేపటి నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. జూన్ 24 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లో రాష్ట్రంలోని వివిధ జట్లు పాల్గొని అభిమానులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను అందించనున్నాయి. టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మంగళగిరి ACA అంతర్జాతీయ స్టేడియంలో తొలిసారిగా జరుగుతున్న ఈ ఏపీఎల్-2026 టోర్నమెంట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆటగాళ్లు, ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. జూన్ 30న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు రాష్ట్ర విద్య, ఐటీ-ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

