AP&TG

రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు-ఎండలు,వర్షాలు

అమరావతి: రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వైపు ఎండతీవ్రత, మరో వైపు పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం వుంటొంది.ఇదే సమయంలో తెలంగాణ, రాయలసీమ మీదుగా మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతుందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో గురువారం (09-04-26) కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

ఉష్ణోగ్రతలు:- బుధవారం పల్నాడు(జి) క్రోసూరు, తిరుపతి (జి) వరదయ్యపాలెంలో 42.2°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు.

వర్షపాతం:- తూర్పుగోదావరి(జి) పైడిమెట్టలో 44మిమీ, కాకినాడ(జి) డి.పోలవరంలో 37.7మిమీ వర్షపాతం నమోదైందని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *