DISTRICTS

నగరపాలక సంస్థ బడ్జెట్ రూ.473,31,30,000 కోట్లు-ఏకగ్రీవంగా అమోదం-మేయర్

నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా నూతన బడ్జెట్ రూపొందించామని కార్పొరేషన్ మేయర్ సుజాత ప్రకటించారు. నగర పాలక సంస్థ సర్వసభ్య వార్షిక బడ్జెట్ ప్రత్యేక సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. మేయర్ దేవరకొండ సుజాత అశోక్ అధ్యక్షతన 2026-27 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు ప్రారంభ నిల్వ రూ.126,40,60,239 కోట్ల రూపాయలతో, జమలు రూ. 366,35,92,000 కోట్లతో కలిపి మొత్తం రూ. 492,76,52,239 కోట్లు జమలుగా ప్రతిపాదించి దానికి అనుగుణంగా రూ.473,31,30,000 కోట్ల రూపాయల ఖర్చులను అంచనా వేసి బడ్జెట్ ను ప్రవేశపెట్టి, సర్వసభ్యులు కౌన్సిల్ తీర్మానం ద్వారా ఆమోదించారు. ఈ సమావేశంలో కమిషనర్ వై.ఓ నందన్,  వివిధ డివిజనుల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *