CRIMENATIONAL

అంతర్జాతీయ అయుధాల స్మగ్లింగ్ ముఠా అరెస్ట్

అమరావతి: ఢిల్లీలోని వాల్డ్ సిటీ నుండి పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లతో సంబంధాలున్న ఒక ప్రధాన అంతర్జాతీయ ఆయుధాల అక్రమ రవాణా ముఠాను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర ఆయుధాల అక్రమ రవాణా ముఠాకు చెందిన 10 మంది కీలక కార్యకర్తలను అరెస్టు చేశారు. ప్రత్యేక దళాలు మాత్రమే ఉపయోగించే PX-5.7 పిస్టల్‌తో సహా, సబ్‌మెషిన్ గన్‌లు, PX-5.7 పిస్టల్‌లు, PX-3 పిస్టల్‌లు, షాడో CZ పిస్టల్‌లు, బెరెట్టా పిస్టల్‌లు, టారస్ పిస్టల్‌లు, వాల్థర్ పిస్టల్‌లతో సహా మొత్తం 21 అత్యాధునిక విదేశీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ ముఠా సభ్యులు ఇండో-నేపాల్ సరిహద్దు గుండా పాకిస్థాన్ నుండి భారతదేశంలోకి ఆయుధాలను అక్రమంగా రవాణా చేసి, ఢిల్లీ-ఎన్‌సిఆర్-ఇతర రాష్ట్రాలలోని నేర ముఠాలకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *