ఇస్లామిక్ స్టేట్‌గా మార్చాలనేది విజయవాడలో పట్టుబడిన ముగ్గురు టెర్రరిస్టుల లక్ష్యం
విజయవాడ అంటేనే మావోయిస్టులకు,టెర్రరిస్టులకు సేఫ్ జోన్ గా మారిపోయిందంటే,నగరంలో పని చేస్తున్న పోలీసు వ్యవస్థ నిఘా ఏ స్థాయిలో వుందో ఆర్దం చేసుకోవచ్చు..కేంద్ర నిఘా సంస్థలు సమాచారం అందిస్తే కాని ఇక్కడ పోలీసులు ఇలాంటి వారిని అదుపు చేయాలేని స్థితిలో వున్నరనే విమర్శలు సర్వత్ర విన్సిస్తున్నాయి…ఈ నేపధ్యంలో….
అమరావతి: విజయవాడలో రెండు రోజుల క్రిందట ముగ్గురు యువకుల (మహ్మద్ రహ్మతుల్లా షరీఫ్ (23), మీర్జా సోహైల్ బేగ్ (23), మహ్మద్ డానిష్ (27) లు) అరెస్టుతో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్వర్క్ బట్ట బయలు అయింది.వీరి నెట్ వర్క్ కేవలం నగరంకే పరిమితం కాలేదు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న భద్రతాపరమైన విషయమని పోలీసులు గుర్తించారు. పట్టుపడిన టెర్రరిస్టుల కార్యకాలపాలు నిర్వహిస్తున్న వీరిని విచారించిన పోలీసులకు వీళ్లు సామాన్య నేరస్థులు కాదని, దేశవ్యాప్త, అంతర్జాతీయ ఉగ్రవాద సానుభూతిపరులతో సంబంధాలు కలిగి ఉన్నారని తేలింది. వీరితో సంబంధాలు నెరుపుతున్న 42 మంది సభ్యుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వీరి వెనుక ఉన్న భారీ నెట్వర్క్ ను ఛేదించేందుకు ఏడు రాష్ట్రాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేశంలోని 7 రాష్ట్రాల్లో:- పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలోని 7 రాష్ట్రాలు(ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, తెలంగాణ) వంటి ప్రాంతాలకు చెందిన సుమారు 42 మంది యువకులతో ఒక రహస్య సోషల్ మీడియా గ్రూప్ నడుస్తోంది. ఈ గ్రూప్ ద్వారా ఐసిస్ (ISIS), కిలాఫత్ ఐడియాలజీని వ్యాప్తి చేస్తున్నారు. వీరంతా ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్నారు. భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్‌గా మార్చాలనేది వీరి ప్రధాన సంభాషణల సారాంశమని పోలీసులు గుర్తించారు. జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను పెట్టి ఫొటోలు దిగడం వీరి తీవ్రవాద ధోరణికి నిదర్శనమని పోలీసులు తెలిపారు.
జిహాదీ వైపు మళ్లించి:- పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ వంటి దేశాల్లో ఉన్న ఉగ్రవాద సంస్థలతో వీరు నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారు. భారతీయ యువతను జిహాదీ వైపు మళ్లించి, శిక్షణ కోసం విదేశాలకు పంపేందుకు ఈ ముగ్గురు యువకులు ప్రోత్సహిస్తున్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లలో కీలకమైన ఆడియో క్లిప్పింగ్‌లు, జిహాదీ మెసేజ్‌లు లభించాయి.

