అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదు-ఇరాన్-అమెరికా వెనక్కు తగ్గినట్లేనా?
ఉత్తుత్తి ప్రకటనలు చేయడం డొనాల్డ్ ట్రంప్ కే సాధ్యం..అమెరికా వెనక్కు తగ్గినట్లేనా?
యుద్ధ విరమణ అమెరికాకే పరిమితం–ఇజ్రాయెల్...
అమరావతి: శత్రువు గట్టిగా తిరగబడుతాడు… అంటే అమెరికాకు ఎక్కడ లేని భయం…”అమెరికా దాడులు చేస్తున్న దేశం నుంచి తట్టబుట్ట సర్దుకుని పారిపోతుంది” అనేందుకు ఉదాహరణ అఫఘనిస్థాన్….ఈ నేపధ్యంలో అమెరికా,,ఇరాన్ పై దాడులు చేసిన తరువాత అదే స్థాయిలో ఇరాన్ తన క్షిపణులు,డ్రోన్లతో పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై విరుచుకుని పడుతొంది.తమ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే,,గల్ఫ్ దేశాలపై ఇంత కంటే తీవ్రమైన దాడులు చేస్తామని హెచ్చరించింది..దింతో గల్ఫ్ దేశాల ఒత్తిడి తట్టుకోలేక…చర్చలు ఇరాన్ తో చర్చలు జరుగుతున్నయంటూ,,అమెరికా తొక ముడిచిందా అంటే…ట్రంప్ ప్రకటన అదే నిజం చేస్తొంది…
ఉత్తుత్తి ప్రకటనలు చేయడం డొనాల్డ్ ట్రంప్ కే సాధ్యం- టెహ్రాన్…ఇరాన్‌తో రెండు రోజులుగా జరుగుతున్న చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని, దీంతో ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజులు వాయిదా వేయాలని తన బలగాలను ఆదేశించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై టెహ్రాన్ స్పందించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది. తమ ఇంధన సంస్థలపై ఎలాంటి దాడులు చేసినా శత్రువుల ఇంధన వనరులపై దాడి చేస్తామని టెహ్రాన్ గట్టి హెచ్చరిక చేసినట్టు తెలిపింది. దీంతో ఇరాన్ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందనే భయంతోనే ట్రంప్ వెనక్కి తగ్గారని ప్రభుత్వ మీడియా పేర్కొంది. ట్రంప్ మాటలను పూర్తిగా నమ్మలేమని, దాడుల వాయిదా పేరుతో సమయం చూసి దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించింది.
యుద్ధ విరమణ అమెరికాకే పరిమితం–ఇజ్రాయెల్...
ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటనపై ఇజ్రాయెల్ సైతం స్పందించింది. యుద్ధ విరమణ అమెరికాకే పరిమితమని పేర్కొంది. తాము యుద్ధాన్ని విరమించలేదని తెలిపింది.

