PMR పాఠశాలలో విడతల వారీగా ఇంటర్మీడియట్-మంత్రి నారాయణ
నెల్లూరు:నగరంలోని రంగనాయకులపేట వద్ద ఉన్న PMR నగరపాలక ఉన్నత పాఠశాలలో అదనపు గదులు నిర్మించి విడతల వారీగా ఇంటర్మీడియట్ ను ప్రవేశ పెట్టడం జరుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. శనివారం PMR నగరపాలక ఉన్నత పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ చదువుకున్న ప్రాముఖ్యతను వివరిస్తూ చదువు ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. అభివృద్ధి పనులకు ముందుకు వచ్చిన దాతలు శ్రీనివాస్ రెడ్డిని అభినందించారు. అదేవిధంగా పూర్వ విద్యార్థులు అయినటు వంటి రంగా-శివకుమార్లు ముందుకు వచ్చి స్టేజిని నిర్మించడం, త్రాగునీటి ఆరో ప్లాంట్ ను నిర్మించడం అభినందనీయం అని అన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపల్ పాఠశాలలను వి ఆర్ పాఠశాల లాగా జిల్లాలోని 15 మున్సిపల్ ఉన్నత పాఠశాలలను దాతల సహకారంతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు, పీఎంఆర్ నగర పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హేమావతి, నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ శ్రీలక్ష్మి, హెల్త్ ఆఫీసర్ కనకాద్రి, తదితరులు పాల్గొన్నారు.

