నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశభక్తి,మనలో ప్రేరణ కలిగిస్తూనే ఉన్నాయి-పవన్ కళ్యాణ్
అమరావతి: భారత స్వాతంత్ర్య సమరయోధుడు & ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అయనను గుర్తుచేసుకొవడం నా సుకృతంగా భావిస్తున్నాను అని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేతాజీ నిర్భయ నాయకత్వం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుదిపేసిందని,, ఆయన ధైర్యం, మాతృభూమి పట్ల అచంచలమైన ప్రేమ దేశభక్తి మనలో ప్రేరణ కలిగిస్తూనే ఉన్నాయన్నారు.తరతరాలుగా దేశం కోసం నిలబడటానికి మనకు స్ఫూర్తినిస్తున్నాయి అని వెల్లడించారు.
బానిసత్వపు సంకెళ్లను తెంచేందుకు “నాకు రక్తం ఇవ్వండి… మీకు స్వాతంత్ర్యం ఇస్తాను” అంటూ దేశ యువతను ఉత్తేజపరిచిన నేతాజీ జీవితం నేటి తరాలకు శాశ్వత ప్రేరణ ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు నిలబడి ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేసి, స్వాతంత్ర్య పోరాటానికి కొత్త ఊపునిచ్చిన అసమాన యోధుడు నేతాజీ అని కొనియాడారు. దేశభక్తి, త్యాగం, కర్తవ్యనిష్ఠలతో నిండిన నేతాజీ ఆలోచనలు నేటి భారత నిర్మాణానికి మార్గదర్శకమని, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ సేవలో ముందుకు రావాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అకాంక్షించారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ కలల భారతదేశాన్నిసాకారం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు.

