ఏ.పిలో 10వ తరగతి పరీక్షల తుది షెడ్యూల్ విడుదల
3-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షల తుది షెడ్యూల్ విడుదల అయింది. గతంలో ఇచ్చిన టెంటేటివ్ షెడ్యూల్‌నే ఫైనల్ షెడ్యూల్‌గా ఖరారు చేస్తూ Bse.Ap (బోర్డు ఆఫ్ సెంకడరీ ఎడ్యూకేషన్) విభాగం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. మార్చి 16వ తేది నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
10ప తరగతి పరీక్షల వివరాలు:-
మార్చి 16వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్.
మార్చి 18వ తేదీన సెకండ్ లాంగ్వేజ్.
మార్చి 20వ తేదీన ఇంగ్లీషు.
మార్చి 23వ తేదీన గణితం.
మార్చి 25వ తేదీన ఫిజికల్ సైన్స్.
మార్చి 28వ తేదీన బయోలాజికల్ సైన్స్.
మార్చి 31వ తేదీన సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నారు.

