భూ వివాదాల్లో రాజకీయ నాయకుల ప్రమేయంపై ఫిర్యాదులు వచ్చాయి-పవన్ కళ్యాణ్
పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన..
అమరావతి: విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో కొన్ని భూ వివాదాల్లో రాజకీయ నాయకుల ప్రమేయంపై ఫిర్యాదులు వచ్చాయని, జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. శాంతి భధ్రతలపై సమీక్షలో వివిధ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలకు సూచనలు చేస్తూ, విశాఖ జోన్ లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల అధికారులు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారన్నారు. ఇందుకు స్పందించిన సీ.ఎం చంద్రబాబు నాయుడు, భూ వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని ఎంత మాత్రమూ సహించొద్దని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశించారు. విశాఖ, విజయనగరం, అనకాపల్లి తదితర జిల్లాల్లో రాజకీయ నాయకుల జోక్యంపై ఫిర్యాదులు రాకూడదని, ఎవరి మీద ఫిర్యాదు వచ్చినా వదిలిపెట్టవద్దని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
సౌండ్ పొల్యూషన్ పై:- ఈ సమావేశంలోనే సౌండ్ పొల్యూషన్ గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ, మతం పేరుతో విపరీతమైన సౌండ్ పెట్టి కార్యక్రమాలు, వేడుకలు, ప్రార్థనలు చేయడం తప్పు అన్నారు. ఎక్కడైనా కేవలం చట్టం,, సుప్రీంకోర్టు ఆదేశం మాత్రమే అమలులో ఉంటాయన్నారు. నిర్దేశించిన డెసిబుల్స్ లోనే సౌండ్ ఉండాలి. ఇందుకు సంబంధించి ఉన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు.
పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన:- విశాఖలో కొందరు ఆకస్మికంగా వచ్చి దాడి చేస్తే పోలీసు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసినా ఏమీ పట్టించుకోలేదన్నారు.కొందరు రాజకీయ నేతలు దీని వెనుక ఉన్నరని,,దింతో అదికారులు చర్యలు తీసుకోకపోవటం ఇబ్బందికరం…నేరాల్లో నిర్లిప్తంగా ఉండటం సరికాదన్నారు. అధికారంలో ఉండి కూడా ఏమీ చేయటం లేదనే విమర్శలు ఎదుర్కోంటున్నాం అని అన్నారు. ప్రజాప్రయోజనాలకు విఘాతం కలిగించేలా జరుగుతున్న నేరాల పట్ల అలక్ష్యంగా ఉండొద్దని, కఠినంగా వ్యవహరించాలని ఎస్పీలు, కలెక్టర్లను ఆదేశిస్తున్నమన్నారు.

