గిరిజన గ్రామాల అభివృద్ధిపైనా కలెక్టర్లు దృష్టి సారించాలి-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి: రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న కలెక్టర్లుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు.. బుధవారం సచివాలయంలోని జరిగిన 5వ జిల్లా కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ 4 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేశామన్నారు.జిల్లా కలెక్టర్లు నిబద్ధతతో పని చేస్తూ కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లాలని ఉప ముఖ్యమంత్రి కోరారు.
మారుమూల గిరిజన గ్రామాలు:- నిబద్ధతతో కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం వుందని,,గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం ప్రాధాన్యంగా తీసుకున్నామని తెలిపారు.పంచాయతీరాజ్ సిబ్బంది శిక్షణలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచామని,కలెక్టర్ల చొరవతో పల్లె పండుగ 1.0ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేశామని డిప్యూటీ సీఎం అన్నారు. రైతులకి అండగా 22,500 మినీ గోకులాలు, 15 వేల నీటి తొట్టెలు, 1.2 లక్షల ఫామ్ పాండ్స్ నిర్మించి సకాలంలో పనులు పూర్తి చేయగలిగామని వెల్లడించారు. రూ. 4,330 కోట్ల మేర నిధులను వేతనాలుగా నరేగా నుంచి చెల్లించామని, గ్రామ పంచాయితీల్లో రెవెన్యూ ఆర్జనపై కూడా దృష్టి సారించామని చెప్పారు.గ్రామీణ స్థాయిలో పాలనా సామర్ధ్యాల పెంపు కోసం కృషి చేయాలని సూచించారు. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధిపైనా కలెక్టర్లు దృష్టి పెట్టాలని అన్నారు. కేంద్ర పథకాల అమలులో వంద శాతం ఫలితాలు సాధించిన అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు.

