వాట్సప్ ద్వారా రాజీనామను పంపించిన మేయర్ స్రవంతి-కలెక్టర్ అమోదిస్తారా?
నెల్లూరు: మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేస్తూన్నట్లు శనివారం రాత్రి ప్రకటించారు.ఆదివారం ఉదయం స్వయంగా వెళ్లి జిల్లా కలెక్టర్‌కు రాజీనామా పత్రాన్ని అందిస్తానని స్రవంతి చెప్పారు. నేడు కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వాట్సప్ ద్వారా తన రాజీనామను పంపించారు. వాట్సప్ ద్వారా రాజీనామా పంపడంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆమోదిస్తారా? లేదా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే గత కొన్ని నెలలుగా కోర్టులు సైతం నోటీసులను వాట్స్ ఫ్ అఫ్ ద్వారా పంపిస్తున్న నేపధ్యం చూస్తే,, కలెక్టర్ అమోదిస్తారేమో? వేచి చూడాలి..ఈ నెల 18న అవిశ్వాస తీర్మాన సమావేశం జరగనున్న నేపధ్యంలో ఈ డ్రామా నడిచింది. గిరిజన బిడ్డను ఎదుర్కొనే శక్తి లేక కుట్రలు చేశారని,,తన ఉసురు తగులుతుందంటూ మంత్రి నారాయణ,,రూరల్ ఎమ్మేల్యేపై శాపనార్దలు పెట్టారు.

