సిటీ నుంచి నలుగురు కార్పొరేటర్లు రూరల్ నుంచి ఒక కార్పొరేటర్ వైసీపీలో చేరిక
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో YSRCPలో చేరారు. నెల్లూరు సిటీ, రూరల్ టీడీపీ కార్పొరేటర్లు మద్దినేని మస్తానమ్మ (నెల్లూరు సిటీ 6వ డివిజన్ కార్పొరేటర్), ఓబుల రవిచంద్ర (నెల్లూరు సిటీ 5వ డివిజన్ కార్పొరేటర్), కాయల సాహితి (నెల్లూరు సిటీ 51వ డివిజన్ కార్పొరేటర్), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (నెల్లూరు సిటీ 16వ డివిజన్ కార్పొరేటర్), షేక్ ఫమిదా (నెల్లూరు రూరల్ 34వ డివిజన్ కార్పొరేటర్). నెల్లూరు సిటీకి సంబంధించి మాజీమంత్రి అనిల్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న మరో 5 మంది కార్పొరేటర్లతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్సీ ఓటుతోపాటు 10 మంది వైసీపీ ఖాతాలో వున్నారు. మరో ఇద్దరు వైసీపీలోకి వస్తే.. మేయర్ పై అవిశ్వాసం వీగిపోయినట్లే. ఈ తంతుని మాజీ మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నడిపిస్తున్నారు.దింతో నెల్లూరు కార్పరేషన్ కథ రసవత్తరంగా మారుతొంది.చూద్దాం ఏం జరుగుతుందొ?

