ఇమ్రాన్ సజీవంగా, ఫిట్‌నెట్‌తో ఉన్నారు-ఇమ్రాన్ సోదరి ఉజ్మా ఖానుమ్
అమరావతి: మాజీ క్రికెటర్,,పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధ్యక్షడు ఇమ్రాన్ ఖాన్ జైలులో సురక్షితంగానే ఉన్నట్టు ఇమ్రాన్ సోదరి ఉజ్మా ఖానుమ్ ప్రకటించారు. అడియాలా జైలులో ఉన్న ఆయనను కలుసుకునేందుకు అనుమతించాలంటూ పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగడంతో జైలు అధికారులు ఉజ్మా ఖానుమ్‌ను మంగళవారంనాడు అనుమతించారు. తన సోదరుడిని కలుసుకున్న అనంతరం ఇమ్రాన్ సజీవంగా, ఫిట్‌నెట్‌తో ఉన్నారని ఆమె వెల్లడించారు.ఇదే సమయలో అయనన్ను మానసికంగా వేధిస్తుండడం,, ఎవరితోనూ మాట్లాడేందుకు అనుతించకపోవడంపై ఆయన చాలా కోపంగా ఉన్నారని తెలిపారు.
ఎట్టకేలకు ఇమ్రాన్‌ను:- ఇమ్రాన్‌ఖాన్ జైలులోనే మరణించినట్టు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు దావానలంగా మారాయి. జైలులోనే ఇమ్రాన్‌ను చంపేందుకు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్‌తో ఐఎస్ఐ కుట్ర పన్నిందంటూ బలూచిస్థాన్ విదేశాంగ శాఖ ఆరోపించడంపై ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ఇమ్రాన్‌ను చూసేందుకు తమను అనుమతించడం లేదంటూ జైలు పరింటెండెంట్, ఇతర అధికారులపై ఆయన సోదరి అలీమా కోర్టులో పిటిషన్ కూడా వేశారు. పీటీఐ కార్యకర్తలు తమ ఆందోళనలను ఉధృతం చేయడంతో ఎట్టకేలకు ఇమ్రాన్‌ను కలుసుకునేందుకు ఉజ్మాను జైలు అధికారులు అనుమతించారు.

