INTERNATIONAL

జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా సానే తకైచి

అమరావతి: జపాన్‌లోని పార్లమెంట్ సభ్యులు మంగళవారం నాడు కరడుగట్టిన సంప్రదాయవాద అయిన సానే తకైచిని జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా ఎన్నుకున్నారు. చక్రవర్తి నరుహిటోను మర్యాద పూర్తకంగా భేటీ అవుతారు. పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. దింతో అధికార లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్షురాలిగా జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా సానే తకైచి ఎన్నికయ్యారు.

ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు ఎగువసభలో అధికార పార్టీ మెజారిటీని సాధించలేకపోయింది.ఇదే సమయంలో దిగువసభలో కూడా మెజారిటీని కోల్పోయింది.ప్రధాని ఇషిబాపై ఒత్తిడి పెరగడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే శనివారం పార్టీలో ఎన్నికలు జరుగగా,, మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కోయిజుమితో పాటు మరో ముగ్గురు అభ్యర్థులను ఓడించి తకాయించి విజయం సాధించారు. 64 ఏళ్ల సానే తకైచి 1993లో స్వస్థలమైన నారా నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *