ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో 40 నిమిషాల పాటు రాష్ట్రంకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. అందులో కర్నూలులో జరగనున్న సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. అలాగే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరుగనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు తెలుస్తొంది.

