AP&TGMOVIESOTHERS

ఇరు తెలుగు రాష్ట్రల్లో వీరమల్లు సినిమా టికెట్లు రేటు పెంచుకునేందుకు అనుమతులు!

అమరావతి / తెలంగాణ: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని జులై 24వ తేదిన గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాన్నునది.. హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది..14 రోజుల పాటు టికెట్ రేటు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్మాత ఏ ఏం రత్నం ప్రభుత్వంకు విజ్ఞప్తి చేశారు..అయితే, 14 రోజుల పెంపు విజ్ఞప్తిని తిరస్కరించిన ఏపీ ప్రభుత్వం 10 రోజులకు మాత్రమే టికెట్ ధరను పెంచుకునేలా అనుమతి ఇస్తూ నిర్ణయం చేసింది..అన్ని సినిమాలను సమానంగానే చూస్తామని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది..

రాష్ట్రంలోని అన్ని థియేటర్ల:- ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంతో ‘హరిహర వీరమల్లు పార్ట్-1’ సినిమాకి రాష్ట్రంలోని అన్ని థియేటర్ల యాజమాన్యాలకు 23.07.2025 రాత్రి 9.00 గంటలకు ప్రీమియర్ షో కోసం ప్రతి టికెట్‌పై రూ.600/- ప్లస్ GST మేరకు టిక్కెట్ రేట్లను పెంచడానికి అనుమతి లభించింది..ఆ తరువాత షోలకు ప్రతి టికెట్‌పై దిగువ తరగతికి 100/- (GSTతో సహా), ఉన్నత తరగతికి రూ.150/- (GSTతో సహా), మల్టీప్లెక్స్‌ కు రూ.200/- (GSTతో సహా) రేట్లు ఫిక్స్ చేశారు..సినిమా విడుదల తేదీ 24.07.2025 నుంచి 02.08.2025 వరకు 10 రోజుల పాటు టిక్కెట్టు పెంపుకు అనుమతిచ్చారు.. రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు & లైసెన్సింగ్ అథారిటీలు,పోలీసు కమిషనర్లు ఈ విషయంలో అవసరమైన చర్య తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది..

తెలంగాణ:-  ‘హరిహర వీరమల్లు పార్ట్-1’ సినిమాకి టికెట్ రేట్లు తెలంగాణలో పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అనే అనుమానం అభిమానుల్లో వున్నది..ఈ విషయంపై శనివారం నిర్మాత ఏఎం రత్నం మీడియాతో మాట్లాడుతూ,, ఏపీలో టికెట్ రేట్లు పెంచుతున్నారు..తెలంగాణ ప్రభుత్వంకు విజ్ఞప్తి చేశాం… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూద్దాం అన్నారు..సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలవడం జరిగింది..అలాగే సినిమా కూడా కొంత చూపించడం జరిగింది,,మంత్రి చాలా బాగుంది అన్నారు..ఏ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచేందుకు అనుమతులు ఇవ్వడం లేదు..అయితే చారిత్రాత్మిక సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతామన్నారు..హరిహర వీరమల్లు చారిత్రాత్మిక సినిమా, అందులోను నిజాం కాలం కథ కూడా ఉంది కాబట్టి ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు.. సినిమాటోగ్రఫీ మంత్రి ఒకసారి సీఎంతో మాట్లాడి చెప్తాను అన్నారు అని తెలిపారు..ఏపీలో రేట్లు పెంచిన జీవో తీసుకురండి దాన్ని చూసి రేట్ల పెంపు చేద్దాం అన్న అభిప్రాయం వెల్లబుచ్చరని రత్నం తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *