AP&TG

వాయుగుండం రాత్రికి తీరం దాటే అవకాశం

అమరావతి: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, తీవ్ర వాయుగుండంగా మారడంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 7కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. ఇది ప్రస్తుతానికి గోపాల్‌పూర్‌కు 150 కిలోమీటర్లు, కళింగపట్నానికి 100 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరీకి 220 కిలోమీటర్లు, విశాఖపట్టణానికి 180 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. బుధవారం రాత్రిలోగా తీవ్రవాయుగుండంగా విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం తొమ్మిది జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు ఉన్నట్లు హెచ్చరికలు వచ్చాయి.గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్‌ జిల్లాలకు కూడా ఫ్లడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ ఆకస్మిక వరదలకు అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *