NATIONALOTHERSWORLD

భారత్,రష్యా చమురును కొనుగోలు చేసేందుకు మాకు అభ్యతరం లేదు-అమెరికా ట్రెజరీ సెక్రటరీ 

అమరావతి: ఫశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా,ఇజ్రాయిల్ యుద్దం కారణంగా భారత్ తో సహా పలు దేశాలకు చమురు సమస్యాత్మకంగా మారింది.ఈ సందర్బంగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ  స్కాట్ బెసెంట్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు చమురు సరఫరా బాగానే కొనసాగుతోందని,అయితే ఇప్పటికే సముద్ర మార్గంలో ఉన్న రష్యా చమురును కొనుగోలు చేసేందుకు మిత్ర దేశమైన భారత్‌కు అమెరికా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో భారత్‌ చాలా బాధ్యతగా వ్యవహరించిందన్నారు. ముందుగా ఆంక్షలున్న రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని మేము కోరడంతో, భారత్‌ కొనుగొళ్లను ఆపివేసిందన్నారు. ఆ లోటును భర్తీ చేసుకునుందకు అమెరికా నుంచి చమురు కొనాలని భారత్‌ నిర్ణయించిందన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చమురు సరఫరాలో తాత్కాలికంగా లోటు ఏర్పడిందని,, దాన్ని భర్తీ చేసేందుకు రష్యా చమురును కొనేందుకు మేము భారత్‌కు అనుమతి ఇచ్చాం అని వెల్లడించారు. త్వరలోనే రష్యా చమురుపై ఉన్న మరికొన్ని ఆంక్షలను కూడా తొలగించవచ్చు’ అని ఆయన అన్నారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్‌కు ఉపశమనం కలిగించేలా చర్యలు కొనసాగిస్తున్నామని స్కాట్ పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *