NATIONALOTHERSWORLD

ఇరాన్‌ కు  ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తాం-ట్రంప్

అమరావతి: ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, టెహ్రాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ట్రూత్‌ సోషల్‌ వేదికగా ట్రంప్‌ పోస్టు చేశారు. ఇరాన్‌లో పాలన మార్పును స్వాగతిస్తున్నమని, భవిష్యత్తులో ఆ దేశంతో కలిసి పనిచేయడానికి అమెరికా సన్నద్ధమవుతోందని వెల్లడించారు.ఇరాన్‌లో ఇకపై యురేనియం శుద్ధి కార్యక్రమాలు జరగవన్నారు. ఇరాన్‌ అణు కేంద్రాల శిథిలాల క్రింద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను వెలికితీస్తామని చెప్పారు. ఇరాన్‌లోని అణు కేంద్రాలు తమ నిఘా నీడలో ఉన్నాయని, గత సంవత్సంర జూన్ లో అమెరికా దాడి చేసినప్పటి నుంచి అణు కేంద్రాల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగట్లేదని పేర్కొన్నారు.ఇరాన్ విధించిన ఆంక్షల తొలగింపుపై రాబోయే రోజుల్లో ఆ దేశంతో చర్చలు జరుపుతామని ట్రంప్‌ వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *